About MICCI in Telugu

About MICCI in Telugu

 1. MICCI అంటే
  • Madiga Industrial Chambers of Commerce, Industry.
  • మాదిగల ఆర్థికాభివృద్ధికి కృషి చేసే సంస్థ.
  • మాదిగ వ్యాపార పారిశ్రామికవేత్తల సంఘాము
 2. MICCI లక్ష్యాలు
  • భారతదేశంలోని ప్రతి మాదిగ ఆర్థిక అభివృద్దే లక్ష్యం.
  • మాదిగ యువతను పారిశ్రామిక వెత్తలుగా వ్యాపార మరియు పారిశ్రామిక రంగంలోకి ప్రవేశించడానికి మరియు వారి సొంతస్థానాన్ని ఏర్పరచుకోవాడానికి ప్రోత్సహించడము.
  • మాదిగ వ్యాపార నాయకత్వాన్ని అభివృద్ధి చేయడము.
  • మాదిగలు ఉద్యోగాల కోసం వెతికే వారిగా కాకుండా,ఉద్యోగాలు ఇచ్చే వారిగా తీర్చిదిద్దడము.
  • స్వయం సహయ(Self Help)వ్యవస్థాపకత(Entrepreneurship) ద్వారా ఆర్ధిక సాధికారత గురించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కలలను సాకారం చేయడానికి కృషి చేయడము.
 3. MICCI సిద్ధాంతము
  • ప్రతి మనిషి ఎదుగుదలతో వారి ప్రవర్తన, స్వభావం ఎంత ముఖ్యమో వారు బ్రతకడానికి ఆర్థిక స్వాతంత్రం కూడా అంతే ముఖ్యం.
   మనిషి తన జీవన విధానాన్ని కొనసాగించే క్రమంలో, ప్రతి విషయంలో డబ్బు చాలా కీలక పాత్ర పోషిస్తుంది.
  • పేదవారిగా పుట్టడం తప్పుకాదు కాని, పేదవారిగ చచ్చిపోవడం మాత్రం ఖచ్చితంగే తప్పే” ఏ రంగంలో రాణించాలన్నా ముందు ఆర్థిక రంగంలో రాణించాలి Economic Power Is The First Master Key- Mahesh Gogorla
 4. MICCI ఆవశ్యకత
  • మాదిగలకు ప్రపంచంలోనే మొట్ట మొదట పారిశ్రామికవెత్తలు వ్యాపారవెత్తలు మానవుడు నడవడానికి చెప్పులు తప్పనిసరి అని గుర్తుంచి మొట్టమొదట చెప్పుల పరిశ్రమ పెట్టి చెప్పులు తయారు చెసింది మాదిగనే.
  • ఈ చెప్పున పరిశ్రమల ద్వారా సంవత్సరానికి అయ్యే వ్యాపారం ఒక భారత దేశంలోనే దాదాపు 140 కోట్ల జనాభా ఒక్కొకరికి ఒక జత చెప్పులు సుమారు 100 రూపాయలు అంటే 14000 వేల కోట్ల రూపాయల వ్యాపారం,
  • మరీ నెలకు నెలకు 1168 కోట్లు రోజుకి 40 కోట్ల వ్యాపారం తెలంగాణ జనాభా 4 కోట్లు అయితే రూ “100=400 కోట్లు సంవత్సరానికి మరీ నెలకు 34 కోట్లు రోజుకి 1 కోటి 30 లక్షల.
   వ్యాపారం ఇది కేవలం ఒక సగటు మనిషి దాదాపు సంవత్సరానికి ఒక జత చెప్పులు ఖర్చు మాత్రమే లెక్క పెట్టాము కాని.
  • ఇప్పుడు లెదర్ తో కేవలం చెప్పులు మాత్రమే కాదు బూట్లు, బెల్టులు, బ్యాగ్ పర్సులు మరి ఎన్నో రకాలు, అన్ని లెక్క పెడితే రోజుకి కొన్ని వందల కోట్లతో వ్యాపారం అయినప్పటికి ఆ లెదర్ పరిశ్రమను స్థాపించిన మాదిగలు మాత్రం ఆర్ధికంగా అట్టడుగున ఉన్నారు.
  • ప్రపంచీకరణ, ప్రవేటీకరణ, పట్టణీకరణ కారణంగా ఎంతో మంది నిరుద్యోగులుగా ఉండటము.
  • సరైన ఉపాధి అవకాశాలు/ జాబ్స్ నోటిఫికేషన్ లేక ఎంతో మంది విద్యార్థులు నిరుద్యోగంతో బాధపడటము.
  • రోజురోజుకి పెరుగుతున్న ప్రవేటీకరణ కారణంగా, ఉన్న ఉద్యోగులలో ఆసురక్షిత స్థానం పెరుగుటము ముందు ముందు జరిగే ప్రవేటీకరణలో రిజిస్ట్రేషన్లు ఉండవు అని గుర్తించడము.
  • కరుణ మహమ్మారి వలన వ్యాపారాల్లో నష్టపోతున్న మరియు ఉద్యోగాలు కోల్పోతున్న మాదిగ కుటుంబాలకు ఆర్థిక అంశాల పైన వ్యాపార అంశాల పైన అవగాహన కల్పించి ఆర్థిక భరోసా ఇవ్వడము వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పటము.
  • జనాభాలో అత్యధికంగా ఉన్న మాదిగలు ఆర్థికాభివృద్ధిలో మాత్రం అట్టడుగున ఉన్నారు ఆర్థికంగా లేకపోవడం వల్లనే మాదిగలు అన్ని రంగాలలో వెనుకబడుతున్నారు. ఏ రంగంలో రాణించాలన్న ముందు ఆర్థిక రంగంలో రాణించాలి.
  • ప్రాథమికంగా కాని, చారిత్రకంగా కాని మాదిగలు మొట్ట మొదటి పారిశ్రామిక వెత్తలు, ఆ కీర్తిని మనం తప్పక తిరిగి సంపాదించుకోవాలి, మనల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి.
  • ఇవన్ని కేవలం ఒక ప్రత్యేక ఆర్థిక అభివృద్ధి సంస్థ (Self Center for Madigas Economic Development) ఏర్పాటు ద్వారా మాత్రమే సాధ్యమని భావించి శ్రీ మహేష్ గోగర్ల గారు MICCI సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది.
   మాదిగలు ఏ ప్రాంతంలో ఉన్న ఏ పార్టీలో ఉన్న ఏ రంగంలో ఉన్న ఏ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరి ఆర్థిక అభివృద్దే లక్ష్యంగా MICCI పనిచేస్తుంది.
 5. MICCI కార్యకళాపాలు
  • మాదిగ పారిశ్రామిక వ్యాపారవెత్తలందర్ని అందర్నీ ఒకే గొడుగు కిందికి తీసుకురావడము.
  • శిక్షణలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, వ్యాపార అవకాశాలపైన అవగాహన కార్యక్రమాలు వాణిజ్య ప్రదర్శనలు నిర్వహించడము.
  • మాదిగల సామాజిక ఆర్థిక సమస్యలకు పరిష్కారంగా వారిలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడము.
  • వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి అభివృద్ధి చేయడానికి ఒక సలహాదారునిగా కో-ఆర్డినేటర్ గా, మార్గదర్శకుడిగా MICCI వ్యవహరిస్తుంది.
  • ఇప్పటికీ ఉన్న మరియు ఔత్సహిక స్థానిక (Up Coming) పారిశ్రామిక వెత్తలకు One Stop Resource Center గా పని చేయడము.

× Whatsapp with us !